Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోని మంత్రం పనిచేసింది... అశ్విన్ స్పిన్ కు బోల్తా కొట్టిన వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండో ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాడు. నాలుగో రోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన డేవిడ్ వార్నర్ తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. వచ్చీరాగానే బ్యాట్ ఝుళిపించిన వార్నర్ కేవలం 42 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఈ సమయంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వేసిన ఎత్తుగడ ఫలించింది. ఆదిలోనే స్పిన్ బౌలర్లను రంగంలోకి దించిన ధోనీ, వార్నర్ ను పెవిలియన్ చేర్చాడు. 15వ ఓవర్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతికి కంగారుపడ్డ వార్నర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 57 పరుగుల వద్ద ఆసీస్ తన తొలి వికెట్ ను కోల్పోయింది. వార్నర్ వెనుదిరగడంతో షేన్ వాట్సన్ (5) క్రీజులోకొచ్చాడు. మరో ఓపెనర్ రోజర్స్ (27) తో కలిసి వాట్సన్ ఆసీస్ ఇన్నింగ్స్ ను దారిలో పెట్టే బాధ్యతను తీసుకున్నాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఒక వికెట్ ను కోల్పోయి 75 పరుగులు చేసింది.

More Telugu News